ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. బ్లాక్ బస్టర్స్ నుంచి అట్టర్ ఫ్లాప్స్ వరకు చాలా సినిమాలు తీశాడు. కానీ.. ఎప్పుడూ క్లోజింగ్ కలెక్షన్లు వెల్లడించలేదు. ఓ సినిమాకు ఎంత డబ్బు వచ్చిందనే విషయాన్ని బయటపెట్టలేదు. తొలిసారిగా దిల్ రాజు ఈ జానర్ లోకి కూడా ఎంటరయ్యాడు. తన లేటెస్ట్ మూవీకి సంబంధించి క్లోజింగ్ కలెక్షన్లు బయటపెట్టాడు.
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా రీసెంట్ గా తన థియేట్రికల్ రన్ ముగించుకుంది. ఈ సందర్భంగా సినిమాకు వచ్చిన ఫైనల్ వసూళ్లను దిల్ రాజు బయటపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 134 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు వెల్లడించారు.
ఈనెలలోనే ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అవుతుంది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఎఫ్3 మూవీ క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ.20.57 కోట్లు
ఉత్తరాంద్ర – రూ.7.48 కోట్లు
ఈస్ట్ – రూ.4.18 కోట్లు
వెస్ట్ – రూ.3.41 కోట్లు
కృష్ణా – రూ.3.23 కోట్లు
గుంటూరు- రూ.4.18 కోట్లు
నెల్లూరు- రూ.2.31 కోట్లు
సీడెడ్- రూ.8.58 కోట్లు
కర్ణాటక- రూ.5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.2 కోట్లు
ఓవర్సీస్ – రూ.10 కోట్లు
ఏపీ/తెలంగాణ షేర్ – రూ.53.94 కోట్లు (జీఎస్టీ కలిపి)
వరల్డ్ వైడ్ షేర్ – రూ.70.94 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – రూ.134 కోట్లు