ఎఫ్3 సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, సినిమాపై ఉన్న బజ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ మోస్తరుగా జరిగింది. భారీ సంఖ్యలో థియేటర్లు, స్క్రీన్లు కేటాయించడం వల్ల ఏ థియేటర్ పూర్తిగా నిండలేదు. దీంతో వసూళ్లు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ ఎఫ్3 సినిమా మొదటి రోజు మెరిసింది. తొలిరోజే రెండంకెల షేర్ అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు 10 కోట్ల 37 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు నైజాంతో పాటు అన్ని ఏరియాల నుంచి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. 63 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాను ఉత్తరాంధ్ర, నైజాంలో దిల్ రాజే సొంతంగా రిలీజ్ చేశారు.
ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజే ఈ సినిమాకు యూఎస్ లో హాఫ్ మిలియన్ (5 లక్షల) డాలర్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం – 4.06 కోట్లు
ఉత్తరాంధ్ర – 1. 18 కోట్లు
గుంటూరు – 88 లక్షలు
నెల్లూరు 62 లక్షలు
ఈస్ట్ – 76 లక్షలు
వెస్ట్ – 94 లక్షలు
కృష్ణా – 67 లక్షలు
సీడెడ్ – 1.26 కోట్లు