అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఇందులో తమన్నా, మెహరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నాడు.
కాగా తాజాగా సినిమా మొదటి సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి పాట లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇక ఎఫ్ 3 కథ డబ్బు చుట్టూ తిరగబోతుందన్న సంగతి తెలిసిందే. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఒక్క పాట మాత్రమే పెండింగ్‌లో ఉంది.
ఇక రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. అలాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ , సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన విడుదల అయిన లుక్స్ అన్ని కూడా సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాపై అంచనాలను కూడా పెంచాయి.