తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని అందుకుంది ఎఫ్3 సినిమా. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 63 కోట్లు 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 27 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అయితే 3 రోజుల బ్రేకప్ వివరాల్ని మాత్రం యూనిట్ బయటపెట్టలేదు.
ఏపీ,నైజాంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 29 కోట్ల 95 లక్షల రూపాయలు రావాలి. ఈ మొత్తం ఈజీగా రాబడుతుందని యూనిట్ చెబుతోంది. ఎందుకంటే, ఈ సినిమాకు రోజురోజుకు మౌత్ టాక్ బాగుంది. ఒకటో తేదీ నుంచి పదో తరగతి స్టూడెంట్స్ ఫ్రీ అయిపోతారు.ఉద్యోగులకు జీతాలు కూడా పడతాయి. కాబట్టి మరింతమంది థియేటర్లకు వస్తారనేది నిర్మాతల అంచనా.
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటించిన ఈ సినిమా రిజల్ట్ పైనే ఎఫ్4 ఆధారపడి ఉంది. ఈ సినిమాకు మంచి లాభాలు వస్తే ఎఫ్4 వస్తుంది. లేదంటే రానట్టే.
అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటించగా.. ప్రత్యేక పాత్రలో సోనాల్ చౌహాన్, ఐటెంసాంగ్ లో పూజాహెగ్డే మెరుపులు మెరిపించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా మారింది.