వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్3 రెండో రోజు కూడా మంచి వసూళ్లు
రాబట్టింది. ఈ 2 రోజుల్లో సినిమా 18.77 కోట్ల షేర్‌కి చేరుకుంది. ఈరోజు ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కోసం చాలా పెద్ద సంఖ్యలో క్యూలు ఉన్నాయి. దీంతో 3 రోజుల వసూళ్లు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది.
నవ్వులు పూయించే సినిమాకి రిపీట్ వాల్యూ ఉంటుంది. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు. ఎఫ్3 సినిమాకు రోజురోజుకు వసూళ్లు పెరగడానికి ఇదే కారణం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 63 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
ఓవర్సీస్‌లోనూ ఎఫ్3 అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు ఇప్పటివరకు 7 లక్షల 50వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. త్వరలోనే ఇది మిలియన్ మార్క్ క్రాస్ చేస్తుంది. ఓవర్సీస్ లో సోమవారం హాలిడే వచ్చింది. దీంతో ఎఫ్3కి మరిన్ని వసూళ్లు రావడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 8.16 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.23 కోట్లు
సీడెడ్ – 2.41 కోట్లు
గుంటూరు – 1.42 కోట్లు
నెల్లూరు – 0.86 కోట్లు
ఈస్ట్ – 1.28 కోట్లు
వెస్ట్ – 1.23 కోట్లు
కృష్ణ – 1.18 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.23 కోట్లు
సీడెడ్ – 2.41 కోట్లు
గుంటూరు – 1.42 కోట్లు
నెల్లూరు – 0.86 కోట్లు
ఈస్ట్ – 1.28 కోట్లు
వెస్ట్ – 1.23 కోట్లు
కృష్ణ – 1.18 కోట్లు
మొత్తం 2 రోజుల షేర్ (ఏపీ-నైజాం): రూ. 18.77 కోట్లు