వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా మండే టెస్ట్ పాస్ అయింది. వర్కింగ్ డే అయిన సోమవారం ఈ సినిమాకు వసూళ్లు బాగా తగ్గుతాయని ట్రేడ్ భావించింది. కానీ ప్రేక్షకులు బాగానే వచ్చారు. మరీ ముఖ్యంగా ఈవెనింగ్ షో, సెకెండ్ షోలు హౌజ్ ఫుల్స్ నడిచాయి.
అలా సోమవారం రోజున ఎఫ్3 సినిమాకు తెలుగు రాష్టాల్లో ఏకంగా 4 కోట్ల 64 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ స్థాయిలో వసూళ్లు రావడం చెప్పుకోదగ్గ విశేషం. తాజా వసూళ్లతో.. ఎఫ్3 సినిమాకు ఏపీ,నైజాంలో టోటల్ గా 4 రోజుల్లో 32 కోట్ల 11 లక్షల రూపాయల షేర్ వచ్చింది. దీంతో ఈ సినిమా 50శాతానికి పైగా బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది. ఈ వీకెండ్ కూడా సినిమా ఇలానే రన్ అయితే.. ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.
అటు ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. మెమోరియల్ డే హాలిడే కలిసి రావడంతో యూఎస్ లో కూడా ఎఫ్3కి మంచి వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఎఫ్3 సినిమాకు 4 రోజుల్లో 75 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
ఈ వీకెండ్ కూడా ఎఫ్3 సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి. కేవలం మేజర్ మూవీ నుంచి మాత్రమే ఎఫ్3కి పోటీ ఉంది. కానీ రెండు సినిమాల జానర్లు వేర్వేరు కావడంతో ఎక్కువ మంది కుటుంబ ప్రేక్షకులు ఎఫ్3కే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.