అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఘన విజయం సాధించిన ఎఫ్ 2 మూవీకి సీక్వెల్.. ఎఫ్ 3 పట్టాలెక్కింది. ఎఫ్ -3 మూవీని సినిమా యూనిట్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్, తమన్నాపై ముహూర్తపు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 23 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో మరో హీరో కూడా ఉంటాడన్న ప్రచారం జరగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ స్పందించలేదు. ఇటీవలే ‘ఎఫ్-3’ కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దాన్ని బట్టి.. ‘ఎఫ్-3’ స్టోరీ డబ్బు చుట్టూ తిరగనుందని అర్థమవుతోంది. ‘ఎఫ్-2’లో నటించిన వారే.. ఇందులోనూ కనిపించనున్నారు.