అనిల్ రావిపూడి దర్శకత్వంలో F2కి సీక్వెల్ గా F3 రాబోతుంది. హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్లు మెహ్రిన్, తమన్నా లు నటిస్తున్నారు. ప్రస్తుతం F3 షూటింగ్ కరోనా కారణంగా పెండింగ్ లో ఉంది. కరోనా సెకండ్ వేవ్ తో నిలిచిపోయిన షూటింగ్ అక్టోబర్ లో మైసూర్ లో రీస్టార్ట్ చేయబోతున్నారు. ఈ లోపు వరుణ్ తేజ్ గని షూట్ పూర్తి చేసుకోని రావాల్సి ఉంది.
అయితే, గతంలో ఉన్న ఆలోచన ప్రకారం… F3షూట్ కోసం ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్ వేయాలి. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ ను మాట్లాడినట్లు చిత్ర యూనిట్ నుండి సమాచారం అందుతోంది. దాదాపు నెల రోజుల షెడ్యూల్ నాన్ స్టాప్ గా ఇక్కడ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
F3 మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.