ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ కు భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. మొతేరా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండనని… బుమ్రా బీసీసీఐని రిక్వెస్ట్ చేశాడు.
బుమ్రా రిక్వెస్ట్ ను బీసీసీఐ అంగీకరించటంతో జట్టు నుండి రిలీవ్ అయ్యాడు. ఈ అంశాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే, బుమ్రా స్థానంలో కొత్తగా మరో ఆటగాడిని ఎవర్నీ తీసుకోవటం లేదని… మిగిలిన ఆటగాళ్లలోని 11మందితో భారత్ బరిలోకి దిగుతుందని తెలిపింది.
బుమ్రా తన వ్యక్తిగత కారణాలతో జట్టు నుండి తప్పుకోగా… తన స్థానంలో తుది జట్టులోకి హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ను తీసుకునే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ఇండియా2-1తో ఆధిక్యంలో ఉంది. దీంతో నాలుగో టెస్టుపై ఫుల్ ఫోకస్ ఉంది.