నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి3 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఎటువంటి అంచనాలు లేకుండా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించి భారీ కలెక్షన్లను సాధించిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా చాప్టర్2 ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఈ చాప్టర్ 2 లో బాలయ్య నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా లో బాలయ్య నటిస్తున్నాడు అనే మాట అభిమానుల్లో ఆసక్తిని రేపింది.
అసలు విషయానికి వస్తే కేజిఎఫ్ 2 లో బాలయ్య నటిస్తున్నారనేది చిత్రయూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ గూగుల్ లో మాత్రం కేజిఎఫ్ సినిమా లో నందమూరి బాలకృష్ణ ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటిస్తున్నట్లు గూగుల్ లో చూపిస్తుంది. నిజానికి పాత్రలో నటిస్తున్నది వేరే నటుడు. అతనికి బదులుగా బాలయ్య పేరు పడింది. అందుకు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.