యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- డైరెక్టర్ రాజమౌళి కాంబోలో సినిమా వస్తుందని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. ఇటీవల రాజమౌళి, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు కలిశారని… జక్కన్న అడ్వాన్స్ కూడా తీసుకున్నారని ప్రచారం జరిగింది.
అయితే, ప్రభాస్ తో రాజమౌళి పైగా మైత్రీ మూవీ మేకర్స్ లో అనేది కేవలం ప్రచారమే అని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ప్రభాస్ మైత్రీమూవీ మేకర్స్ సంస్థలో సినిమా చేసేందుకు ఓకే అయ్యిందని, కానీ డైరెక్టర్ రాజమౌళి కాదని స్పష్టం చేశాయి. గతంలోనే ఓసారి అడ్వాన్స్ ఇచ్చేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నిస్తే తన కెరీర్ లో ముందస్తు అడ్వాన్స్ లు ఉండవని రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది. రాజమౌళి వచ్చే సినిమా కేఎల్ నారాయణతో చేసి ఆ తర్వాత సొంత ప్రొడక్షన్ హౌజ్ లో సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం.