పాకిస్తాన్ లాహోర్ లోని ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి భవనం ధ్వంసమయ్యింది. మంటలు కూడా వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
పేలుడు తీవ్రత ఫ్యాక్టరీకి సమీపంలోని భవనాలపై కూడా పడింది. పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాయిలర్ పేలిన సమయంలో పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు పోలీసులు.