సినిమా పరిశ్రమలో నిలబడటం అనేది సాధారణ విషయం కాదు. ఎన్ని హిట్ లు వచ్చినా సరే వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే కెరీర్ ప్రమాదంలో పడినట్టే అనే భావన ఉంటుంది. మీడియా కూడా అన్ని వైపుల నుంచి టార్గెట్ చేస్తూ ఉంటుంది. వేరే వాళ్ళతో పోటీ తీవ్రమై ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి ఉంటుంది. ఇక అవకాశాలు రాకపోతే నిలబడటం చాలా కష్టం. ఇలా సినిమా పరిశ్రమ నుంచి దూరమైన వాళ్ళు ఎందరో ఉన్నారు.
అలా దూరమై ప్రాణం తీసుకున్న వ్యక్తి ఉదయ్ కిరణ్. అతని కెరీర్ మొదట్లో వచ్చిన సినిమాలు స్టార్ హీరోలను సైతం భయపెట్టాయి. ఆ తర్వాత అతని కెరీర్ పడిపోతు వచ్చింది. మంచి హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా చేసే వాళ్ళు లేక అనేక ఇబ్బందులు పడ్డాడు ఉదయ్ కిరణ్. అతని మొదటి సినిమా విషయానికి వస్తే… ఎన్నో మలుపుల తర్వాత చిత్రం సినిమా చేసాడు.
ఆ సినిమా కంటే ముందు అతను సినిమాల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అహ్మద్ అనే వ్యక్తి ఉదయ్ కిరణ్ ఫోటోని తేజాకి చూపించాడు. అప్పుడే తేజా చిత్రం సినిమా కథ అనుకుంటున్నాడు. ఆ సినిమా కోసం చాలా మందిని ట్రై చేసాడు. కాని ఎవరూ నచ్చలేదు. చివరికి ఉదయ్ కిరణ్ ని ఎంపిక చేసారు. సినిమా బడ్జెట్ ను నిర్మాత రామోజీ రావు 40 లక్షలకు కుదించారు. దీనితో హీరో బడ్జెట్ 11 వేలు మాత్రమే. దీనితో మరో ఆప్షన్ లేక ఉదయ్ కిరణ్ ని ఎంపిక చేస్తే… రామోజీ రావుకి అతను నచ్చలేదు. మరికొందరిని అనుకున్నా వాళ్ళు నో అన్నారు. ఇక తప్పక ఉదయ్ కిరణ్ తో చేయాల్సి వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
Also Read: డైరెక్టర్ బాబీ… ముందు ఏ స్టార్ దర్శకుల దగ్గర చేసాడంటే…!