అందం ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టమైనా ఉండాలి. ఈ విషయంలో కొంతమంది హీరోయిన్లు చాలా వెనకబడి ఉన్నారు. అవకాశాలు రావని తెలిసినా కూడా తమ దండయాత్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అవకాశాల కోసం అందాల వల విసురుతూనే ఉన్నారు. కామ్న జఠ్మలానీ, పూనమ్ బజ్వా, రాయ్ లక్ష్మి, నేహాశర్మ, వేదిక.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాంతాడంత అవుతుంది.
వీళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం కామ్న జఠ్మలానీ గురించే. ఈమెకు అవకాశాలు తగ్గి ఏళ్లు గడిచిపోయాయి. ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ కూడా ఈ ముద్దుగుమ్మను మరిచిపోయింది. కానీ కామ్న మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు. ఎవరైనా అవకాశమిస్తే హీరోయిన్ గా నటిస్తానంటోంది. తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఎప్పటికప్పుడు గ్లామరస్ స్టిల్స్ అప్ లోడ్ చేస్తోంది.
ఇక మరో అందాల తార పూనమ్ బజ్వా. ఈ పిల్ల కూడా క్రీస్తుపూర్వమే ఫేడవుట్ అయింది. అవకాశాలు పూర్తిగా అడుగంటాయి. కానీ బజ్వా మాత్రం తగ్గేదేలే అంటోంది. వరుస ఫోటొషూట్స్ తో సందడి చేస్తోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పరోక్షంగా పరిశ్రమను కవ్విస్తోంది.
Advertisements
నేహాశర్మది కూడా సేమ్ టు సేమ్. టాలీవుడ్ ఎప్పుడో పక్కనపెట్టింది, రీసెంట్ గా బాలీవుడ్ కూడా సైడ్ చేసింది. ప్రస్తుతం పంజాబీ ఇండస్ట్రీ మాత్రమే ఎంకరేజ్ చేస్తోంది. కానీ నేహా మాత్రం మరోసారి కుదిరితే బాలీవుడ్ లో, కుదరకపోతే టాలీవుడ్ లో నటించేందుకు తన ప్రయత్నాలు తానూ చేస్తూనే ఉంది. కొత్తవాళ్లు ఎవరైనా సోషల్ మీడియాలో ఆమె స్టిల్స్, వీడియోలు చూస్తే స్టార్ హీరోయిన్ అనుకుంటారు.
ఇక వేదిక, రాయ్ లక్ష్మి, అంజలి లాంటి హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుతున్నారు. మేం కూడా ఉన్నాం గుర్తించండంటూ ఇండస్ట్రీకి సిగ్నల్స్ పంపిస్తున్నారు. వీళ్లలో ఎంతమందికి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ వస్తుందో చూడాలి.