హైదరాబాద్‌లో దొంగ వీఐపీ బాబా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భూత వైద్యం పేరిట 7 పెళ్లిళ్లు చేసుకున్న దొంగ బాబాను లంగర్ హౌస్ లో పోలీసులు అరెస్టు చేశారు. 8వ పెండ్లి చేసుకోబోతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. దయ్యం పట్టిందంటూ నమ్మించి యువతులను లొంగదీసుకోవడం ఈ బాబా స్పెషాలిటీ అని పోలీసులు చెబుతున్నారు.
rr
పెండ్లి కోసం అమ్మాయి తరఫు వారు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి 11 గంటలకు పెండ్లి ముహూర్తం ఉండగా ఆ బాబా రాలేదు. ఈ క్రమంలో ఆ బాబా కోసం అమ్మాయి తరఫు వారు చాలా సేపు ఎదురు చూశారు. కానీ ఎంత సేపు ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అమ్మాయి తరఫు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. లంగర్ హౌజ్ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం… టోలీ చౌకీకి చెందిన తబుస్సుమ్ ఫాతిమా మూడేండ్లుగా నెల్లూరు దర్గాలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.
ఈ క్రమంలో దర్గాలోని బాబా రెహ్మతా బాబాకు ఆమెతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో వారిద్దరికి హైదరాబాద్ టోలిచౌకి ఫంక్షన్ హాల్‌లో తబస్సుమ్ కుటుంబ సభ్యులు వివాహం ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది.
కానీ వివాహ సమయానికి ఆ బాబా అక్కడికి రాలేదు. ఎంతసేపు ఎదురు చూసినా రాకపోవడంతో తబుస్సుమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బాబాకు గతంలో 7 పెళ్లిళ్లు అయినట్లు అమ్మాయి తరఫు బంధువులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో కేసు నమోదు చేశారు.