తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ అంటూ ప్రభుత్వం ఇచ్చినట్లు ఓ జీవో బయటకొచ్చింది. జనం నిజమేనేమో అని భయపడ్డారు. కానీ కొద్దిసేపటికే ఇది నకిలీ జీవో అంటూ ప్రభుత్వవర్గాలు క్లారిటీ ఇచ్చాయి. రాత్రిపూట లాక్ డౌన్ జీవో అంటూ రిలీజ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మాదాపూర్ లో నివాసముంటున్న శ్రీపతి సంజీవ్ అనే నెల్లూరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. గతంలో లాక్ డౌన్ అంటూ ఇచ్చిన జీవోను నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని, డేటు మార్చి వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశాడని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
సంజీవ్ స్నేహితులు నకిలీ జీవోను ఇతర గ్రూపుల్లో పంపినట్లు చెప్పారు. తప్పుడు జీవోలను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.