సామాజిక మాధ్యమాల అడ్డాగా తప్పుడ ప్రచారం చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశమంతా లాక్‌డౌన్ పాటిస్తున్న నేపథ్యలో కొందర్ ఫేక్‌గాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేపటి నుంచి వైన్‌షాపులు ఓపెన్ చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఏకంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఓ ఫేక్ జీఓను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై పోలీసులు సిరీయస్‌గా ఉన్నారు. కేటుగాళ్లకోసం దర్యాప్తు చేస్తున్నారు.