హీరోయిన్ రష్మిక ఫోటోలను ఉద్దేశించి చించేసావ్ పో అంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ పేరుతో ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సాధారణంగా తారలు ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో దూసుకుపోతున్నహీరోయిన్ రష్మిక మందన్న. ఇటీవల ఈ అమ్మడు ట్విట్టర్ వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను ఉద్దేశిస్తూ కలెక్టర్ రవి పేరుతో ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కలెక్టర్ రవికుమార్ పేరుతో ట్వీట్ వైరల్ కావటంతో ఇదే విషయమై కలెక్టర్ స్పందించారు. తాను ఆ ట్వీట్ చెయ్యలేదని, తనకేం తెలియదని కలెక్టర్ జి. రవి కుమార్ తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని కలెక్టర్ వెల్లడించారు. హ్యాక్ పై విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.