ప్రధాని మోడీ పర్యటనలో నకలీ జవాన్‌ను పోలీసులు గుర్తించారు. ఎన్ఎస్జీ ఉద్యోగినంటూ ఫేక్ ఐడీ కార్డుతో సభలో వీవీఐపీ ఏరియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతడు ఎందుకలా చేశాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ప్రధాని మోడీ ముంబై పర్యటన సమయంలో నకిలీ జవాన్ ను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. ప్రధాని సభకు రావడాని కన్నా 90 నిమిషాల ముందు నకిలీ జవాన్‌ను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.
విచారణ అనంతరం అతని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. మహారాష్ట్రలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోడీ గురువారం హాజరయ్యారు. వేదిక వద్దకు ప్రధాన చేరుకుంటారనగా ఒక వ్యక్తి అక్కడ అనుమానాస్పదంగా కనిపించాడు.
దీంతో అతన్ని భద్రతా సిబ్బంది అదపులోకి తీసుకుని ప్రశ్నించింది. నకిలీ జవాన్ గుర్తించి పోలీసులకు అప్పగించింది. గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన నాయక్‌గా చెప్పుకుంటూ ఆ నకిలీ జవాను అత్యంత భద్రత ఉన్న వీవీఐపీ ఏరియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశాడు.
నిందితున్ని సైన్స్ గ్రాడ్యుయేట్ రామేశ్వర్ మిశ్రా (35) గా పోలీసులు గుర్తించారు. నిందితునిపై ఐపీసీ సెక్షన్ 171, 465, 468, 471 కింద కేసు పోలీసులు నమోదు చేశారు. అనంతరం బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం అతన్ని పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.