కసమాజంలో సంఘాలకు కొదవలేదు. ఆయా సామాజిక వర్గాలు, వ్రుత్తులు, ప్రవ్రుత్తుల ద్రుష్ట్యా పలుసంగాలు సంతరించుకుంటాయి. ఏ సంఘమైనా సంబంధిత సమూహానికి బలమివ్వాలి. సభ్యుల బతుకులు బాగుపడాలి. ఏ సంఘానికైనా,ఏ సమూహానికైనా ప్రధాన అజెండా అదే అయ్యుండాలి. అదే ఉంటుంది కూడా. కానీ మనిషి ప్రాథమిక హక్కైన..జీవించే హక్కుకి ఏ సంఘం భగం కలిగించినా అది సంఘమే కాదు. సదరు సంఘానికి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఏమాత్రంలేదు.
అయితే మానహక్కులను నిలువునా పాతరేసిన ఓ ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా, ‘ఉండి’ మండలంలో బైటకు వచ్చింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కులపెద్దల బండారం బట్టబయలైంది.చెరుకువాడకు చెందిన రాణి ఆకివీడుకి చెందిన సతీష్ వ్యక్తిని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. బతుకుదెరువు కోసం రాణి దుబాయ్ వెళ్ళి వచ్చింది. సంపాదించిన డబ్బుతో సొంత ఇల్లుకట్టుకుని భర్తపిల్లలతో జీవిస్తుంది. అయితే రాణిపై కన్నేసిన సంఘపెద్ద కనకారావు ఆమెను లోబరుచుకోవడానికి పలుమార్లు విఫల యత్నం చేసాడు. దీంతో రాణి వేరేకులం వ్యక్తితో కలిసి ఉండడం కుదరదని ఒత్తిడి తెచ్చేవాడు.
రాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కులపెద్దలకు, రాణికుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిచేసారు. అప్పటి నుండి కనకారావు సహా మరికొందరు కులసభ్యుల వేధింపులు పెచ్చుమీరాయి. అంతే కాదు రాణి కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదు,ఏ సాయమూ చెయ్యకూడదని నిర్ణయించింది. కాదని వారికి సహకరించినా పలకరించినా రూ.5వేల జరిమానా విధంచబడుతుందని తీర్మానించేసారు.
కులం తీసుకున్న కుటిల నిర్ణయంతో రాణికుటుంబం ఆత్మహత్యదాకా వెళ్ళింది.పరిణామం పోలీసులకు తెలియడంతో వెలివేతకు కారణమైన కనకారావుతోబాటు సహకరించిన మోహనరావు,మధు తదితరులపై కేసునమోదు చేసారు. పోలీసులు గతంలోలాగే కౌన్సిలింగ్ ఇచ్చిపంపించేయకుండా కోర్టుద్వారా కోటింగ్ ఇచ్చేలా చేయాలని బాధిత కుటుంబం పోలీసులను వేడుకుంది.