కామాంధుడు రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కుటుంబ సభ్యులు డెడ్ బాడీని చూసి అతడేనని నిర్ధారించారు. బావమరిది, అతని స్నేహితులు అది రాజు శవమే అని కన్ఫామ్ చేశారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగానే గుర్తించారు.
కాసేపట్లో ఎంజీఎంలో శవపరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు రాజు డెడ్ బాడీని అప్పగించనున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక పోలీసుల బృందం వరంగల్ కు వెళ్లింది.