రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు తెలియని వారు లేరు. ఎక్కడ చూసినా అతని న్యూసే..రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ… విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈడీ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చీకటి వ్యవహరం బయటకు వచ్చింది.
బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా..హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్న ఆయన… వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం కూడా వెలుగు చూసింది. రెండు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,జెడ్పీ ఛైర్మన్లు… ఇలా చాలా మంది చికోటితో చీకటి బాగోతం నడిపారనే ఆరోపణలు వస్తున్నాయి.
క్యాసినో ప్రవీణ్ ఇదొక పేరు మాత్రమే కాదు….. అదోక బ్రాండ్ అనే స్థాయికి వెళ్లాడు ప్రవీణ్. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు. ఈ చీకటి వ్యాపారంలో మాధవరెడ్డి పాత్ర చాలా కీలకమైందని అధికారులు గుర్తించారు.
అయితే… సైదాబాద్ లో ప్రవీణ్ ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పహారా కాస్తున్నట్లు ప్రవీణ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రవీణ్ సెక్యూరిటీ అప్రమత్తం అయ్యారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఆ వ్యక్తులను కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు.
సోమవారం నాడు ఈడీ ముందు విచారణకు ప్రవీణ్, మాధవరెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ నాయకులతో ఉన్నసంబంధాలను బయటపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్‌కు ప్రాణహాని ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు భయపడుతున్నారు.