దేశం ఆసహ్యించుకునే నీచమైన పనిచేసి… ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ నలుగురు కీచకులు జైల్లో ఎలా ఉన్నారు…? మద్యం మత్తులో చేశామని చెప్పుకున్న ఆ నిందితుల జైలు జీవితం ఎలా ఉంది…? కుటుంబ సభ్యుల పరామర్శల పరిస్థితి ఏంటీ…?
భద్రత లో కేసీఆర్ అభద్రతలో అమ్మాయిలు
అభం శుభం తెలియని అమాయకురాలి జీవితం బలికొన్న రాక్షసుల్లాంటి ఆ నలుగురు నిందితులు… మమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టారు, అసలు మేం చేసిన తప్పు అంత పెద్దదా అన్న రీతిలో వారి హవబావాలున్నాయి. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్షనా అన్నట్లుగా ఉన్నారని జైలు అధికారులంటున్నారు.
ప్రియాంక హత్య కేసులో పోలీస్ ల నిర్లక్ష్యం ఉంది
తొలివెలుగు ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం జైలు అధికారులతో మాట్లాడితే… ఆ నలుగురికి కలపి రెండు సెల్స్ ఇచ్చామని, ఒక్కో సెల్లో ఇద్దరిని ఉంచామని తెలిపారు. అయితే… వారిని కలిసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదని తెలుస్తోంది. వారి కుటంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఎవరూ ములాఖత్‌కు రాలేదు.
”జీవితం నాకు రెండో అవకాశం ఇచ్చింది” : మనీషా కొయిరాల
ఇక జైల్లో ఉన్న వారిలో ఏమాత్రం కూడా తాము తప్పు చేశామన్న బాధ అయితే కనపడటం లేదని తెలుస్తోంది. ఏమౌతుందిలే అన్నట్లే ఉన్నారని… నలుగురి పరిస్థితి దాదాపు అంతే అని ఉన్నతాధికారులంటున్నారు. ఇక వారు ఆత్మహత్య చేసుకుంటారేమోనన్న అనుమానంతో నలుగురికి కలిపి 15మంది స్పెషల్ గార్డులను సెక్యూరిటీగా ఉంచామని… అయితే వారిలో ఆత్మహత్య చేసుకునేంత పశ్చాత్తాపం లేదని అంటున్నారు.
అర్ణబ్ అండగా… కేసీఆర్ పై సోషల్ మీడియా ఫైర్
జైలులో ఉన్నవారందరూ ఆ నలుగురిని అసహ్యంగానే చూస్తున్నారని… అందుకే గట్టి బందోబస్త్ నడుమ వారికి సెక్యూరిటీ ఇస్తున్నట్లు తెలిపారు.