బీజేపీలో కుటుంబ రాజకీయాలకు తావులేదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు ఆయన మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
‘ పార్టీలో కుటుంబ రాజకీయాలకు తావుండదు. ఇతర పార్టీల్లో ఉన్న వంశపారంపర్య రాజకీయాలపై మనం పోరాడాలి. బీజేపీలో ఎవరి బంధువుకైనా టికెట్ ను పార్టీ నిరాకరించినట్లయితే దానికి నేనే బాధ్యత వహిస్తాను” అన్నారు.
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు గురించి ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ విషయంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులు చేసిన రాజకీయాల గురించి ఆయన వివరించినట్టు సమాచారం.
కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రస్తావన రాగా దానిపై … ” ఒక వర్గం ఇప్పటికీ సత్యాన్ని పాతిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. వారు గతంలోనూ అదే చేశారు. మనం దేశం ముందుకు నిజమైన వాస్తవాలను తీసుకురావాలి” అని ఆయన అన్నారు.