చిత్రపరిశ్రమలో నిత్యం బిజీగా ఉంటూ, దేశీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్. తాజాగా ఆయన ఒక్కసారిగా రాజకీయాలపై మాట్లాడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై శ్రీరామ్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
‘ఆర్ఎన్ రవి గవర్నరుగా కాకుండా, రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నాంటూ ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం యజమానులకు పట్టుకుందని అందుకే ఏదో విధంగా మేలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం సాగుతున్న యుద్ధం వేర్పాటువాదానికి, ద్వేషభావాలకు వ్యతిరేకంగా సాగుతుందన్నారు.
అదే సమయంలో గౌరవనీయులైన గవర్నర్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని, ఆయన మాటల్లో రాజకీయ కోణం ఉందని ఆయన ఆరోపించారు. మన దేశ భక్తి చరిత్రకు తెలుసన్నారు. ప్రతి భారతీయుడు తమతమ మాతృభాషను అమితంగా ప్రేమిస్తారన్నారు.
మాతృభాషపై మనం వ్యక్తం చేసే ప్రేమాభిమానాలే మనల్ని మంచి మనిషిగా నిలబెడతాయని’పేర్కొన్నారు. కాగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గొప్ప సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన పీసీ శ్రీరామ్ ఉన్నట్టుండి రాజకీయాలపై మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
The governer of state has now acted as a politician
His bosses wants to win this election by any means.
Fear has set in .we fought the emergency with commitment to our nation. Now this fight is to stop division & hatered and bring back our country to its past glory.— pcsreeramISC (@pcsreeram) January 5, 2023