ఇండియా స్టార్ షట్లర్ బోపన్న భార్యపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి అదే రీతిలో బోపన్న కూడా సమాధానమిచ్చాడు. బోపన్న, సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ కేటగిరీలో ఫైనల్ సమరంలో బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ మాటోస్, లూయిసా స్టెఫానీతో తలపడ్డారు.
వరుసగా రెండు సెట్లు (6-7, 2-6) కోల్పోయి ఓటమి చెందారు. ఆ గేమ్‌తో సానియా గ్రాండ్‌స్లామ్ కెరీర్ కూడా ముగిసింది. ఈ మ్యాచ్ కు బోపన్న భార్య, పిల్లలు కూడా వచ్చారు. సానియా మీర్జా ఫ్యామిలీ కూడా వచ్చింది.
మ్యాచ్ అనంతరం బోపన్న భార్యపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి బోపన్న కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చాడు. ‘బోపన్న భార్య అత్యంత అందమైన మహిళ.. అంతటి అందమైన మహిళను ఎప్పుడూ చూడలేదు..’ అని ఆమె ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీనిపై బోపన్న రియాక్ట్ అవుతూ.. ‘నేను ఇప్పటివరకూ చూడని అత్యంత అందమైన మహిళ.. నేను అంగీకరిస్తున్నాను’ అంటూ సమాధానమిచ్చాడు. ఈ కామెంట్స్ పై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.