సినీ హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. అయితే ఫ్యాన్స్ లో కొంతమంది హార్డ్ కోర్ ఫాన్స్ కూడా ఉంటారు. వాళ్ళు తమ అభిమానాన్ని వివిధ రకాలుగా చూపిస్తూ ఉంటారు. రీసెంట్ గా ఓ అభిమాని హీరో నితిన్ పై అభిమానాన్ని చాటుతూ పెన్సిల్ తో గీసిన బొమ్మనను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అన్నయ్య దిస్ ఈజ్ ఫర్ యు…నాకు మీరంటే చాలా చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి బిగ్ ఫ్యాన్ ఫర్ యు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకునేది అంటూ సుమాంజలి అనే ఫ్యాన్ పెన్సిల్ తో నితిన్ బొమ్మను వేసింది. కాగా ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ రీమేక్ అంధాదున్ లో నటించనున్నాడు. ఆ తర్వాత కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.