బాలీవుడ్ జంట ఆలియా భట్, రణబీర్ సింగ్ ల వివాహం ఈ నెల 14న జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, కొద్ది మంది బంధువులు, స్నేహితులు, కొంత మంది ప్రముఖుల మధ్యన వైభవంగా వీరి వివాహం జరిగింది. కొద్ది నిముషాల్లోనే వీరి వివాహ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఈ వివాహానికి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, శ్వేతా బచ్చన్, శ్లోకా అంబానీ, కరణ్ జోహార్, అయన్ ముఖర్జీ, నవ్య నవేలీ వంటి ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. అయితే బాలీవుడ్ దివంగత నటుడు, రణబీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ లేకపోవడం కొంత లోటుగా కనిపించిది.
అయితే ఓ అభిమాని షేర్ చేసిన వీడియో ఒకటి అందరి హృదయాలను హత్తుకుంది. ఆ వీడియోలో ఆలియా-రణబీర్ వివాహ ఫోటోల్లో రిషి కపూర్ ఉన్నట్టు ఉంది. ఆయనతో పాటు ఫోటోలో నీతూ కపూర్, భరత్ సహ్నీ, మహేశ్ భట్, సోనీ రజ్దాన్,షహీన్ భట్ ఉన్నారు.
ఆ వీడియోను అభిమాని తన ఇన్ స్టా హ్యాండిల్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఫ్రేమ్ నిండుగా ఉంది అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో నీతూ కపూర్, రిద్దిమా కపూర్ ల కంటపడింది. దీంతో వారు ఆనందంతో ఈ వీడియోను రీ పోస్ట్ చేశారు. దానికి ‘ లవ్ దిస్ ఎడిట్… థ్యాంక్యూ ఫర్ షేరింగ్’ అంటూ వ్రాశారు.