సినిమా ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వారి విడాకుల తర్వాత సమంతా వారి వైవాహిక జీవితం పై చాలా సార్లు స్పందించింది. నాలుగు సంవత్సరాలు సంతోషంగా ఉన్న వీరిద్దరూ విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. వీరు విడాకులు తీసుకొని తొమ్మిది నెలలు అవుతున్నా అసలు కారణాలు తెలిసిరాలేదు. కారణాలు ఏవైనా విడాకుల తర్వాత ఈ జంట సినిమా పైనే పూర్తి దృష్టి సారించింది. ఇద్దరు బిజీ అయిపోయారు. ఇప్పటి వరకు విడాకులకు సంబందించిన విషయాలను తెలియజేయలేదు.
కానీ ఇటీవల బాలీవుడ్ లో సత్తా చాటడానికి సిద్ధమైన సమంత.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే సమంతను ప్రశ్నిస్తూ మీ భర్త చైతన్య అని కరణ్ ప్రశ్న వేయబోతుండగానే .. సమంత అడ్డు చెప్పి తన హావభావాలు మారుస్తూ.. భర్త కాదు మాజీ భర్త అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అంతేకాదు తనను.. నాగచైతన్యను ఒకే గదిలో పెడితే అక్కడ కత్తులు కటార్లు లేకుండా జాగ్రత్త పడమని కూడా కామెంట్లు చేయడంతో ప్రతి ఒక్కరు సమంతపై ట్రోల్ చేస్తున్నారు.
నాగచైతన్య గురించి అడిగిన ప్రతి సారి కూడా ఆమె తన ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉండడంతో నాగచైతన్య అభిమానులు సమంత పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విడాకుల విషయంలో, సమంత విషయంలో చాలా హుందాగా ప్రవర్తింస్తున్నాడు చైతు. సమంత విషయాలన్నింటిని చాలా గోప్యంగా ఉంచిన నాగచైతన్య ఏ రోజు కూడా ఆమె గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇక అంతే కాదు బంగార్రాజు సినిమా ఈవెంట్ లో కూడా నాగచైతన్య – సమంత గురించి ఒక్క మాట కూడా నెగటివ్ గా మాట్లాడకపోవడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
కానీ సమంత ఇలా నాగచైతన్య పై తప్పుడు మాటలు మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయింది అని చైతు అభిమానులు అంటున్నారు. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా నాగచైతన్య పై పాజిటివ్ గా మాట్లాడుతూ.. చైతన్య గురించి సమంత నెగటివ్ గా మాట్లాడుతుండడంపై నీకు చైతన్యకు ఉన్న తేడా అదే అంటూ పెద్ద ఎత్తున ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.