యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్లాస్ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. అయితే వివాదాలకు దూరంగా ఉండే ఎన్టీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు మాట్లాడుతూ…. చంద్రబాబు లోకేష్ గురించి నెగిటివ్ కామెంట్ చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను బోనియర్ ఎన్టీఆర్ అంటూ విమర్శించారు.
ఆ సినిమాలో పవన్ నో చెప్తే శ్రీకాంత్ నటించాడట!
ఎమ్మెల్సీ అనంత బాబు వివాదం గురించి మాట్లాడుతున్న సమయంలో ఈ కామెంట్ చేశాడు అంబటి. అంతేకాకుండా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కడుతుంటే వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.
అడవి శేషు హీరోయిన్స్ విషయంలో… కామన్ పాయింట్స్ గమనించారా ?
Advertisements
నిజానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆ విషయాలపై స్పందించడం కూడా మానేశారు. కానీ కొంతమంది వైసీపీ అభిమానులు మాత్రం ఆయన్ని టార్గెట్ చేస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.