మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అంటూ.. సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కొత్తమే కాదు. కానీ, కొన్నిసార్లు శృతిమించి ప్రవర్తిస్తున్నారు అభిమానులు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోస్ విజయ్, అజిత్ అభిమానుల మధ్య సోషల్ యుద్ధం జరుగుతుంది. సన్నిహితంగా ఉంటారు. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పటికే అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మధ్య చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా గొడవలు జరిగాయి.
అయితే, ఈసారి ఈ గొడవ మరీ అగ్లీగా తయారైంది. ఏకంగా హీరో విజయ్ చనిపోయడంటూ వారు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. RIPJosephVijay అనే హ్యాగ్ ట్యాగ్ కూడా అంటూ హీరో విజయ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్నారు. విజయ్ అర్ధాంతరంగా చనిపోయాడని, బీస్ట్ అతడి చివరి సినిమా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు RIPJosephVijay అనే హ్యాగ్ ట్యాగ్‌పై 35 వేలకు పైగా ట్వీట్స్ పోస్టు అయ్యాయి.
అయితే, అంతకుముందు విజయ్ అభిమానులు అజిత్‌ను టార్గెట్ చేసుకుని కొన్ని పోస్టులు చేశారు. అజిత్ ఎయిడ్స్ పేషెంట్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తట్టుకోలేక ఏకంగా విజయ్ చనిపోయాడని అజిత్ అభిమానులు ఎదురుదాడి చేయడం ప్రారంభించారు.
ఈ పోస్ట్ లు చూసిన విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నప్పటికీ.. రివర్స్ ట్రోలింగ్ చేయకుండా Ignore Negativity అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అజిత్, విజయ్ కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నెగెటివ్ ట్రోలింగ్ ఆపాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడాలి వీరి మధ్య వార్ ఎంత దూరం వెళ్తుందో..
#RIPJosephVijay Actor Vijay passed away due to Cardiac arrest. May his soul rest in peace. pic.twitter.com/LSXK596tPA
— Karthikeyan (@karthikeyankceo) March 26, 2022
Take care AK#Aids_Patient_Ajith pic.twitter.com/482u66co5T
— VJ Jhon (@VJJhon6) March 26, 2022
Advertisements