యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా ఇరాశపరచడంతో ఫ్యాన్స్ అంతా ప్రభాస్ నెక్స్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో పూజ హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈసినిమా తరవాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించనున్నాడని అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఈ ఏడాది నవంబర్ నుండి ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది డిసెంబర్‌లో మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. కాని తాజా సమాచారం ఈ చిత్రం ఏప్రిల్ 2022లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది.