ఒక స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నారు అంటే అందులో ఎన్నో అంశాలను అభిమానులు పట్టించుకుంటారు. చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉంటుంది. హీరో ఇమేజ్ తగ్గించుకుని ఏదైనా సినిమా చేస్తే కచ్చితంగా సినిమా ఫలితం మీద ప్రభావం పడుతుంది. అలా ఫ్లాప్ అయిన సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన సత్య హరిశ్చంద్ర సినిమా కూడా ఒకటి.
Also Read:మోర్బీ ఘటనపై నీళ్లు నములుతున్న గుజరాత్
ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా వరలక్ష్మి కూడా నటించారు. సావిత్రి కంటే ముందు తెలుగు ప్రేక్షకులకు మహానటి ఆవిడే. ఆమె హావభావాల కోసం సినిమాకు వెళ్ళే వాళ్ళు. ఈ సినిమాలో కాస్త విషాదం ఎక్కువ ఉండటంతో ఆమెనే తీసుకున్నారు. ఆమె నటన చూసి ప్రేక్షకులు కూడా ఏడ్చే పరిస్థితి ఉంటుంది. ఒకరకంగా ఎన్టీఆర్ కంటే కూడా ఆమెనే హీరో అని అంటూ ఉంటారు. క్లైమాక్స్ లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఎన్టీఆర్ ఈ సినిమాలో కాటి కాపరిగా నటించారు. ఎన్నో భిన్నమైన పాత్రలు చేసిన ఎన్టీఆర్… ఈ సినిమాలో కాటి కాపరిగా నటించడం ఫాన్స్ కి నచ్చలేదు. ఆయన్ను అలా చూడలేక జనాలు సినిమా ఫ్లాప్ చేసారు అంటే ఆయన పాత్ర ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో భానుమతిని తీసుకునే ప్రయత్నం చేయగా ఆమె అయితే ఫాన్స్ చూడలేరు అనుకుని వరలక్ష్మిని తీసుకున్నారు.