బాలీవుడ్ లో మరో హీరో పెళ్లి చేసుకున్నాడు. అతడే ఫర్హాన్ అక్తర్. దాదాపు ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్న షిబానీ దండేకర్ తో డేటింగ్ చేస్తున్నాడు ఈ నటుడు. ఈరోజు ఖండాలాలో వీళ్ల పెళ్లి సింపుల్ గా జరిగింది. కేవలం కుటంబ సభ్యులు, కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.
ఆరేళ్ల కిందట ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించాడు ఫర్హాన్ అక్తర్. అదే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చింది షిబానీ. అప్పుడే వీళ్లిద్దరికీ పరిచయం. అప్పటికే మోడల్ గా, వీజేగా పేరు తెచ్చుకున్న షిబానీని చూసి లవ్ లో పడిపోయాడు ఫర్హాన్. అలా ఆరేళ్లు ప్రేమించుకుంది ఈ జంట. ఈ మధ్యలో తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ఫర్హాన్.
దీపిక పదుకోన్-రణ్వీర్ కపూర్ పెళ్లికి తొలిసారిగా షిబానీతో కలిసి హాజరయ్యాడు ఫర్హాన్. వీళ్లిద్దరి ఎఫైర్ గురించి అప్పటికే అందరికీ తెలిసినప్పటికీ, అధికారికంగా వీళ్లిద్దరూ బయటకొచ్చింది అప్పుడే. అప్పట్నుంచి ఒకే ఇంట్లో ఉన్న ఈ జంట, ఈరోజు పెళ్లితో ఒకటైంది.
ఫర్హాన్ అక్తర్ ప్రస్తుతం బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, నటుడిగా.. ఇతడికంటూ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. భాగ్ మికా భాగ్ తర్వాత ఇతడి క్రేజ్ మరింత పెరిగింది.