హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా తొలి సినిమాతోనే పెద్ద సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. జాతిరత్నాలు సినిమాలో అందం, అమాయకత్వం కలగలసిన చిట్టి పాత్రలో చక్కటి నటనతో మెప్పించింది. దీంతో ఆమెకు తెలుగు, తమిళ భాషల నుంచి పలు అవకాశాలు వరిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫరియా క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. విజయ్ ఆంటోనీ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేయబోతుంది.
సుసీంద్రన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించే సినిమా కోసం ఫరియా హీరోయిన్‌గా ఎంపికయ్యింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫరియా అబ్దుల్లాను సెలెక్ట్ చేశారట. ఈ వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 1980లలో పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కాబోతుంది.
ఇక ఈ ప్రాజెక్టు షూటింగ్ మే చివరి వారం నుంచి మొదలుకానున్నట్టు సమాచారం. తొలి చిత్రానికి భిన్నంగా ఇందులో ఛాలెంజింగ్‌గా ఆమె క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. ఇందులో ఫరియా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
విజయ్ ఆంటోనీ సినిమాలంటే బాక్సాపీస్ వద్ద మంచి క్రేజ్ ఉంటుంది. మరి పీరియాడిక్ స్టోరీ కావడంతో సిల్వర్ స్క్రీన్‌పై ఈసారి ఎలా కనిపించబోతున్నాడోనంటూ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఫరియా అబ్ధుల్లా ప్రస్తుతం సుధీర్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసురలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. అలాగే, ఇటీవలే బంగార్రాజు సినిమాలో నాగచైతన్యతో స్పెషల్ సాంగ్ చేసింది.