పోలీసుల వేధింపుల తాళలేక యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలో కాశయ్య అనే రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో కాశయ్య బంధువులు భూ తగాదాలపై వేధింపులకు గురిచేసిన ఎస్ ఐ నాగరాజు, ఏ ఎస్ ఐ శ్యామ్ సుందర్ ను సస్పెండ్ చెయ్యాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. రైతు కుటుంబంపై మూడు తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు, తోటి రైతులు ఆరోపించారు. పటేళ్లు, పోలీసుల నుంచి పేద రైతుల భూములను కాపాడాలంటూ రైతులు ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం కాశయ్య హైద్రాబాద్ అమ్మ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
రాచకొండ పోలీసుల దౌర్జన్యం నశించాలి, మా భూములను అవినీతికి అమ్ముడుపోయిన అధికారుల నుండి, దొరలకు కొమ్ము కాసే అధికారుల నుండి కాపాడాలంటూ భారీ ర్యాలీ తీశారు.