రైతులకు ఎన్నో చేస్తున్నాం అని ప్రభుత్వాలు ఎంత చెప్పుకున్నా… తిండికి కూడా కడుపు మాడ్చుకొని పంటపండించే రైతన్నలు ఎందరో. భూమి ఉన్నా, సాగు చేసుకునే సత్తువ ఉన్నా… పేదరికానికి ప్రకృతి సహకరించిన మరింత పేదరికంలోకి జారిపోతూ ఉన్న పశుసంపదను కూడా అమ్మేసుకుంటున్న ఘటనలు అనేకం.
భూమిని సాగుచేసేందుకు ఎద్దులు లేకపోవటంతో భార్య భర్తలే కాడేద్దులయ్యారు. భార్యభర్తలే కాడెద్దులై పొలం దున్నతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణం గాంధీనగర్ కు చెందిన దోమ పకిరప్ప భార్యాభర్తలు పట్టణ శివారులోని మొగులాలి సమీపంలో తన రెండు ఎకరాల పొలంలో కిరాయి గుంటుకతో కందుల విత్తనాలు వేసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కంది, పత్తి మొక్కలలో కలుపు కూడా బాగా పెరిగింది. శని, ఆదివారాల్లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో కలుపు కోసం గుంటుకకు భార్యాభర్తలే కాడెద్దులుగా పొలం కలుపుతీత పనులు చేపట్టారు. కూలీలకు డబ్బులిచ్చే స్థోమత లేక, అటు ఎడ్లు కూడా లేక వారే కలుపుతీత పనులు చేపట్టారు.