ఢిల్లీ నడిబొడ్డున రైతుల ఉద్యమం కొనసాగుతుంది. వేలాది మంది పోలీసులను లెక్క చేయకుండా కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఢిల్లీకి వచ్చే అన్ని వైపుల నుండి ట్రాక్టర్లతో భారీసంఖ్యలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీకి తరలివచ్చారు.
ఇక ఢిల్లీ-హార్యానా సరిహద్దులోని సింఘు బార్డర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. అక్కడ ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో ఓ రైతు గుండెపోటుతో మరణించారు. మదీన గ్రామానికి చెందిన రాజేష్ అనే రైతు మరణించాడు. ఇది ప్రభుత్వ హత్య అని రైతు సంఘాలు మండిపడ్డాయి.
అయితే, ఈ మరణంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇక పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేయటం, టియర్ గ్యాస్ ప్రయోగించటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.