పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతున్న వేళ.. తాజాగా ఓ రైతు అనుమానాస్పద మృతి ఆందోళన కలిగిస్తోంది. కొమిరేపల్లిలో ఏసుపాదం రైతు ఫిట్స్ వచ్చి కాలువలో పడి మరణించాడు. పశువుల మేతకోసేందుకు పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే గుండెపోటుతో రైతు మృతి చెంది ఉంటాడని కొందరు భావిస్తుండగా.. అంతుచిక్కని వాధి కారణంగానే చనిపోయి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కొమిరేపల్లిలో ఇప్పటికే పలువురు అంతుచిక్కని కారణాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఈ క్రమంలోనే ఏసుపాదం మృతి చెందడం కలకలం రేపుతోంది.