కుళ్లు, కుతంత్రాలతో నిండిన రాజకీయాలకు రైతన్న బలవుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడం లేదన్న బాధతో తనువు చాలిస్తున్నాడు. చేతగాని నాయకుల్ని ఎందుకు ఎన్నుకున్నామా అని తనకు తాను శిక్ష వేసుకుంటున్నాడు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురంలో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర కుమార్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన వడ్ల కుప్ప దగ్గరే పురుగుల మందు తాగాడు. దగ్గరలో ఉన్న రైతులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు.
ధాన్యం కొంటారని పది రోజులుగా కుప్ప దగ్గరే కాపలా ఉంటున్నాడు కుమార్. రోజులు గడుస్తున్నాయే గానీ సర్కార్‌కు కనికరం కలగడం లేదు.. వడ్లు కొనడం లేదని భావించి బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలవ్వాలని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ కుళ్లు రాజకీయాలకు మేము చావాలా అని నిలదీస్తున్నారు.