తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శామీర్ పెట్ మండలం కొత్తూరు గ్రామనికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ గ్రామంలో ఉన్న 1.30 గుంటల తమ భూమిని వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని స్థానిక పోలీసులు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
తన భూమి విషయంలో పోలీసులు అన్యాయం చేస్తున్నారని కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు బిక్షపతి. అయితే అప్రమత్తమైన పోలీసులు వారిపై నీళ్లు చల్లి అదుపులోకి తీసుకున్నారు.