భారత్ బంద్ కు మద్దతివ్వకపోగా… బంద్ ను ఫెయిల్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో అధికార పార్టీ సైతం బంద్ కు సహకరిస్తూ, ప్రభుత్వం తరఫున ఇబ్బంది పెట్టకుండా ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ అఖిలపక్ష నేతలు మండిపడుతున్నారు.
గతంలో ఇవే రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిస్తే… మంత్రులను సైతం రోడ్డు మీద నిరసనలకు పంపిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు మద్దతివ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు. మీ యూటర్న్ కు కారణం ఎంటో చెప్పాలని… బీజేపీ అంతగా భయపెట్టిందా అని మండిపడుతున్నారు. రైతుల కోసం తెచ్చిన కొత్త సాగు చట్టాలు రైతులకు ఉరితాళ్లుగా మారుతాయని చెప్పిన టీఆర్ఎస్, కేసీఆర్… ఇప్పుడెందుకు వాటికి మద్దతిస్తున్నట్లు ప్రశ్నిస్తున్నారు.
Advertisements
వరి వేస్తే ఉరే అంటూ ఇటీవల కేసీఆర్ ప్రకటన చేశారు… కానీ ఓవైపు లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులంటున్నారు… వరి వేయకుండా నీరుండి ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ విధానాలన్నీ యూటర్న్ విధానాలని, మాట మీద నిలబడని సీఎం కేసీఆర్ అంటూ మండిపడుతున్నారు. తియ్యటి మాటలతో రైతులను మోసం చేస్తున్న మోడీకి కేసీఆర్ తోడయ్యారని… రైతన్నంతా కలిసి కేసీఆర్ కు బుద్ధిచెప్తారని హెచ్చరిస్తున్నారు.