ఎక్కడ చూసినా రైతుల కంట కన్నీరే. ఏ పంట వేసినా కనీస మద్దతు ధర కల్పించని ప్రభుత్వాలు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి భూసారాన్ని బట్టి రైతులు పంటలు పండిస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు కల్పించకుండా ప్రభుత్వాలు మోసాలకు పాల్పడుతున్నాయని రైతులు అవేదనలో వ్యక్తం చేస్తున్నారు.
అదే తరహాలో ఏపీలో ఉల్లి రైతులకు చుక్కెదురైంది. ఉల్లి ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు ఆగ్రహించారు. కర్నూలు మార్కెట్ లో ఉల్లి కుప్పలపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిరసణ తెలిపారు. గిట్టుబాట ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.