భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. తన పొలంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని చండ్రుగొండ మండలం బాల్య తండాకు చెందిన భూక్య రాధాకృష్ణ సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.తనకు న్యాయం చేయాలని,విద్యుత్ కనెక్షన్ మళ్లీ పెట్టాలని కోరాడు.
Advertisements
అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని కార్యాలయంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న వారు ఆపడంతో ప్రమాదం తప్పింది.