అధికారులపై పెట్రోల్‌పై పోయటం అలవాటై పోయేలా ఉంది. ఎమ్మార్వో విజయారెడ్డి పై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన తర్వాత… భూ వివాదాల్లో అధికారులపై పెట్రోల్ పోసి బెదిరిస్తున్నారు రైతులు.
తెలంగాణలోని అసిఫాబాద్, నారాయణపేట జిల్లాలో ఇవే ఘటనలు వెలుగులోకి రాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోబోయి, అధికారులపై కూడా పెట్రోల్ చల్లాడు. రైతు భరోసాలో తనకు అన్యాయం జరిగిందని రైతు ఈ ఘాతుకానికి ఓడిగట్టాడు. పోలీసులు ఆ రైతును అదుపులోకి తీసుకున్నారు.