రెవెన్యూ సిబ్బంది ఆగడాలకు రైతు ఆత్మహత్యాయత్నం... - Tolivelugu

రెవెన్యూ సిబ్బంది ఆగడాలకు రైతు ఆత్మహత్యాయత్నం…

తెలంగాణలో రెవెన్యూ సిబ్బంది ఆగడాలు మరో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు ఈ సంఘటన జరిగింది. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన రైతు ఐనాల శంకర్‌ ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీంతో తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.గ్రామంలోని సర్వే నెంబర్ 20/a,21/a లో తనకు చెందిన 8 ఎకరాల భూమిని వీఆర్వో లావణ్య సహకారంతో తండా సరిత పట్టా చేసుకుందని చెప్పారు. ఈ విషయమై తహశీల్దార్ కార్యాలయానికి పలు మార్లు తిరిగిన తన భూమిని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Share on facebook
Share on twitter
Share on whatsapp