పోలీసుల వేధింపులు తట్టుకోలేక కాశయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం ఆరెగూడెంకు చెందిన కాశయ్య అనే రైతు భూ పంచాయితీలో గత కొద్ది రోజులుగా నారాయణపురం ఎస్సై నాగరాజు, ఎ ఎస్సై శ్యామ్ సుందర్ వేధింపులకు గురిచేస్తున్నారని కాశయ్య బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఎఎస్సై శ్యామ్ సుందర్,నలుగురు కానిస్టేబుళ్లు కాశయ్య పొలం దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసుల వేధింపులు ఎక్కువ అవ్వటంతో భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. రైతు కాశయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ హయత్ నగర్ లోని అమ్మా ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు.