అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోథ్ మండలం కౌఠా(బి) గ్రామానికి చెందిన చాట్ల నరసింగ్, లక్ష్మి అనే రైతు దంపతులు ఎంఆర్వో కార్యలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. తమకు సంబంధించిన భూమిని ఎంఆర్వో డబ్బులకు ప్రలోభపడి ఇతరుల పేరిట చేశారని ఆరోపిస్తు వారు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు.
కాగా జిల్లా కోర్టులో కేసు ఉండగానే తమ ప్రత్యర్థి వర్గం పేరిట భూముల పట్టాలు చేసిచ్చారని వారు ఆరోపించారు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.