ప్రభుత్వాలు ఎంత గొప్పలు చెప్పుకున్నా, రైతుల కోసం అన్నీ చేస్తున్నామంటూ అంకెలు చెప్పేస్తుంటాయి. తెలంగాణ వస్తే… రైతుల చావులు ఉండవు, కృష్ణా-గోదావరి నీళ్లు మీ భీడుభూములకు మళ్లిస్తాం… అంటూ గొప్పలు చెప్పారు. అయినా ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. గతంలో చేసిన అప్పులు అలాగే ఉన్నాయి. ఈసారి సీజన్ మొదట్లో బ్యాంకులు అప్పులు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హమీ ఏమైందో ఇంతవరకు తేలలేదు. ఇటు అధిక వడ్డీ అయినా పర్వలేదనుకున్నా… బయట కూడా అప్పుదొరకని పరిస్థితి. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితానికి ఇంతకన్నా పెద్ద కష్టం ఏముంటుంది. పనిచేసుకుంటేనే పస్తులుండే రైతన్నల జీవితాలు… ఇక సాగు మానేస్తే ఎలా ఉంటాయి. ఓ వైపు అప్పుపుట్టక, చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలు చేసుకుంటున్న రైతుల జాబితాలో మరో రైతన్న చేరాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా వీరవెళ్ళి గ్రామం లోని రైతు అప్పుల బాధ తో పొలం లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఇతనికి బార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామస్థులు భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినా, పరిస్థితి విషమిస్తుండటంతో… మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.