మంత్రి అందుబాటులో ఉండడు.. ఎమ్మెల్యే చిక్కడు దొరకడు.. అధికారులకు అసలు పట్టదు.. ఇక ముఖ్యమంత్రి సంగతి సరేసరి.. ప్రగతి భవన్ గేటు దాటాలంటే పెట్టిపుట్టాల్సిన పరిస్థితి. బంగారు తెలంగాణలో రైతులకు అడుగడుగునా కష్టాలే..? మరి.. రైతులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి..?
జోగలాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు మద్దెలబండి గ్రామానికి చెందిన రైతు ఈరన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన పొలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో సూసైడ్ కు ప్రయత్నించాడు.
పురుగుల మందు తాగిన రైతును పక్కనే ఉన్నవారు గమనించి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.